|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:14 PM
ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు రాజ్ పాల్ యాదవ్ ఢిల్లీలోని తీహార్ జైలులో లొంగిపోయారు. సుమారు రూ. 2.5 కోట్ల చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆయన జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను అనుభవించనున్నారు. డబ్బు సర్దుబాటు చేసేందుకు మరింత సమయం కావాలంటూ రాజ్ పాల్ పెట్టుకున్న చివరి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయనకు లొంగిపోక తప్పలేదు.జైలుకు వెళ్లే ముందు రాజ్ పాల్ యాదవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "సార్, ఏం చేయను? నా దగ్గర డబ్బు లేదు. నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఇక్కడ మేమంతా ఒంటరివాళ్లం. ఈ సంక్షోభాన్ని నేనే ఒంటరిగా ఎదుర్కోవాలి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
Latest News