|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 08:38 AM
భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన హర్షిని రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల హైదరాబాదులో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో హర్షిని పోటీలలో పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా ఆమెకు మంగళవారం గోల్డ్ మెడల్ ప్రధానం చేశారు. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆమె ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు ఆమెను అభినందించారు.