|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 08:57 AM
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని సదాశివనగర్ పాత పోస్ట్ ఆఫీస్ మూల మలుపు దగ్గర గత కొన్ని రోజుల క్రితం డ్రైనేజీ ఓపెన్ చేయడం జరిగిందని, ఇప్పటివరకు తిరిగి మరమ్మతులు చేయక ప్రజలు ఇబ్బంది పడుతున్నా సంబంధిత అధికారుల్లో స్పందన కరువైందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అటువైపు వెళితే ప్రమాదం తప్పదని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.