|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 08:59 AM
భిక్కనూరు మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయానికి రైతులు మంగళవారం వరిగడ్డిని వితరణ చేశారు. ఆలయంలో గల ఆవు దూడలకు గడ్డిని పెట్టేందుకు తమ వంతుగా ట్రాక్టర్ గడ్డిని అందజేశారు. మల్లుపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ సిద్ధారెడ్డి, రైతు శ్రీనివాసరెడ్డి తమ వంతుగా ట్రాక్టర్ గడ్డిని ఆలయానికి పంపించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సిద్ధిరామేశ్వర ఆలయంలో పెంచుతున్న కోడెలకు తమ వంతుగా గడ్డిని పంపించడం జరిగిందన్నారు.