|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 10:26 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీపీసీసీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్య క్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.