|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 10:33 AM
భారీ వర్ష సూచన దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలకు డిసెంబర్ 6న సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.మిచౌంగ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. మంగళవారం ఉదయం అన్నిశాఖల జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.