by Suryaa Desk | Sat, Jul 13, 2024, 01:14 PM
ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల వల్ల దేశంలో న్యాయ సంక్షోభం తలెత్తడమే కాక పౌర, ప్రజాస్వామిక హక్కులు అణచివేయబడతాయని ప్రొఫెసర్ మురళీ కర్ణం తెలిపారు. సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ఆధ్వర్యాన శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన సెమినార్ లో అయన మాట్లాడారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులను సస్పెండ్ చేసి చట్టాలను ఆమోదించారని, వీటిపై సమగ్రమైన చర్చ లేకుండా అమలు చేస్తుండడం అనేక అనర్ధాలకు దారి తీస్తుందని చెప్పారు.