by Suryaa Desk | Sat, Jul 13, 2024, 01:16 PM
ఖమ్మం నగరపాలక అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే. వీ. కృష్ణారావు డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ సంఘాల నాయకులతో పాటు బాధితులతో కలిసి కేఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై పలు దఫాలుగా విన్నవించిన అధికారులు స్పందించడం లేదని, పైగా ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.