by Suryaa Desk | Sat, Jul 13, 2024, 02:16 PM
వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. పటాన్ చెరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో శనివారం మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొక్కలు నాటి వన సంరక్షణకు కృషి చేయాలని చెప్పారు. అనంతరం కాలనీ ప్రజలతో మాట్లాడారు. గృహ జ్యోతి కింద జీరో బిల్లు వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు.