by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:31 PM
ప్రజల శ్రేయస్సు కోసం జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ పరిధిలోని టిఆర్ నగర్ లో పట్టణ ప్రగతి నిదులు 35 లక్షలతో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్డక శాఖ అధికారి డా. నరేష్, కమిషనర్ సమ్మయ్య పాల్గొన్నారు.