by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:32 PM
కరీంనగర్ నగరం నడి మధ్యలో సుమారు 6ఎకరాల స్థలంలో 11కోట్లతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. పార్కులో చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించి. పనులను త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నగరవాసుల కోసం ఆనందాన్ని పంచేవిధంగా నగరపాలక సంస్థ ఆహ్లాదకరంగా పార్కులు తీర్చిదిద్దుతున్నట్లు మేయర్ అన్నారు.