by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:34 PM
సిరిసిల్ల జిల్లా పరిధిలో కొనసాగుతున్న మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో గనుల శాఖ అధికారులు అరుదైన మూలకాలను శనివారం గుర్తించారు. ఇవి దాదాపు 562. 47 చ. కి. మేర విస్తరించి ఉన్నట్లు తెలిపారు. సర్వేల్లో 17 లోహ మూలకాల 15 రకాల లాంథనైడ్స్తో పాటు స్కాండియం, ఏట్రియంను గుర్తించామన్నారు. ఖనిజాల అన్వేషణకు కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర గనుల శాఖకు నివేదిక పంపింది.