by Suryaa Desk | Sun, Aug 11, 2024, 02:47 PM
అలనాటి రామచంద్రులు మూవీ డైరెక్టర్ ఆకాష్ రెడ్డిని రెడ్డి సంఘం తరుపున ఆదిలాబాద్ లోని సంఘం కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతు బిడ్డగా ఏంతో కష్టపడి ఎదిగి కేవలం రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసి ఏకంగా టాలీవుడ్ డైరక్టర్ గా ఎదగడం రెడ్డి కులస్తులకే కాకుండా మన జిల్లాకే గర్వకారణం అని అన్నారు. మరిన్ని మంచి సినిమాలు తీసి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.