by Suryaa Desk | Sat, Nov 09, 2024, 02:04 PM
వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు కొండంగల్ పోలీస్ అధికారులు కొడంగల్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తున్నా సమయంలో ఒక స్విఫ్ట్ కార్ అపకుండా వెళ్ళిపోతుండగా పోలీస్ అధికారులు ఆ వాహనాన్ని అపి ఆ వాహన డ్రైవర్ ను విచారించి గా అట్టి డ్రైవర్ పేరు అంబరపేట శ్రీకాంత్ గౌడ్, తండ్రి శ్రీనివాస్ గౌడ్, బషీరాబాద్ గ్రామం మరియు మండలం వికారాబాద్ జిల్లా అని తెలియజేయడం జరిగింది. వాహనంలో తనిఖీలు చేయగా అందులో కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే క్లోరల్ హైడ్రేట్ 10 కేజీ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడిని విచారించగ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో కల్తీ కల్లు తయారుచేసి విక్రాయించడం జరుగుతుంది. ఇట్టి కెమికల్ ను తను కర్ణాటక రాష్ట్రం చించోలి కి చెందిన మేఘనాధ్ గౌడ్, బషీరాబాద్ మండలం వాస్తవ్యుడు అయిన నగేష్ గౌడ్ దగ్గర కొనడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. మేఘనాధ్ గౌడ్ ను అదుపులోకి తీసుకోని విచారించగా అతను చితపూర్ కు చెందిన ఉష్ణయ్య గౌడ్ దగ్గర ఇట్టి కిమికల్ ను కొనడం జరుగుతుంది అని తెలిపినాడు.మేఘనాధ్ గౌడ్ దగ్గరి నుండి 5 కేజీలు, ఉష్ణయ్య గౌడ్ దగ్గరి నుండి 5 కేజీలు క్లోరల్ హైడ్రేట్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇట్టి కేసులో సుమారు 60,000 రూపాయల విలువగల 20 కేజీ ల క్లోరల్ హైడ్రేట్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి కేసులోని నిందితులపైన కొడంగల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ చేయడం జరిగింది.
ఇట్టి క్లోరల్ హైడ్రేట్ కిమికల్ కలిపి తయారు చేసిన కల్లును సేవించడం వలన సేవించిన వ్యక్తులకు మత్తు కల్గించడమే కాకుండా, మెదడు, ఇతర శరీర బాగాల మీద ప్రభావం చూపి అనారోగ్యం కల్పించడం జరుగుతుంది. ఇట్టి కల్తీ కల్లును ఒక సారి సేవించిన వారికీ ఇది ఒక డ్రగ్ లాగ అలవాటుపడి దానికే బానిస అయిపోతారు. దయచేసి ప్రజలు ఇట్టి కల్తీ కల్లు పైన అవగాహనా ఏర్పాటు చేయనుకోని ఎవరుకూడ కల్తీ కల్లును చెవించవద్దు అని ఎక్కడైనా కల్తీ కల్లుకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది.
జిల్లాలో ఎవరైనా ఇట్టి కెమికల్ ను ఉపయోగించి కల్తీ కల్లు తయారు చేసిన, గంజాయి లాంటి మత్తు పదార్థాల వ్యాపారం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మత్తు పదార్థాల వ్యాపారాలు, కల్తీ వ్యాపారాలు, అక్రమ రవాణా లు , అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టాస్క్ ఫోర్స్ అధికారులతో జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.