by Suryaa Desk | Sat, Nov 09, 2024, 03:07 PM
దేశంలో సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన ఉల్లి ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. దేశంలోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో ఉల్లి ధరలు నవంబర్ 4న కిలోకు రూ.47.70 ఉండగా, ఇప్పుడు అవి కాస్తా రూ.21కి చేరుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే 20 రూపాయల కంటే తక్కువగా హోల్ సేల్ విధానంలో అమ్ముతుండటం విశేషం. నాసిక్ మండి నుంచి ఎర్ర ఉల్లిపాయలు ప్రధాన మార్కెట్‌లలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇంకా తగ్గుతాయని చెబుతున్నారుదీంతోపాటు అల్వార్ నుంచి కొత్తగా పండించిన ఉల్లి ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌తో సహా కీలకమైన ఈశాన్య నగరాలకు చేరుకుంటున్నాయి. ఇది బహిరంగ మార్కెట్‌లలో ధరలను మరింత తగ్గిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో మాత్రం ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 40-60 పలుకుతోంది. ఈ ధరలు మరికొన్ని రోజుల్లో తగ్గాయని మార్కెట్ వర్గాలు అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఉల్లి ధరలు తగ్గాయి. కిలోకు రూ. 20 లోపు పలుకుతోంది. ఇంకొన్ని చోట్ల 60 రూపాయలకు నాలుగు కేజీలు సేల్ చేస్తున్నారు. ఈ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.
మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ వంటి సహకార సంఘాలు మాత్రం పలు ప్రాంతాల్లో తక్కువ ధరకు ఉల్లిని పంపిణీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఎన్‌సీసీఎఫ్, మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఉల్లిపాయలను కిలోకు రూ. 25 చొప్పున విక్రయిస్తున్నాయి. అందుబాటులో ఉన్న నిల్వలను ఉపయోగించుకుంటుంది.