by Suryaa Desk | Sat, Nov 09, 2024, 03:12 PM
నూతన వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నూతన వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు అన్ని రకాల సేవలు అందించడం కోసం ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) జిల్లాలోని ప్రతి గ్రామం మండలం కవర్ అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
మన జిల్లాలో ఉన్న 20 ప్యాక్స్ కు అదనంగా మరో 5 నుంచి 7 ప్యాక్స్ ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్యాక్స్ ద్వారా రైతులకు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలతో పాటు అవసరమైన ఎరువులు విత్తనాలు అమ్మకం వారి ధాన్య సేకరణ బంగారు రుణాలు, ఇతర సేవలు అందించాలని తెలిపారు. జిల్లాలోని ఎలిగేడు చిన్న కాల్వల ప్యాక్స్ పరిధిలోని జన ఔషధ కేంద్రాలను నిర్వహించేందుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎఫ్.సి.ఎస్ అనుకూలంగా ఉన్నచోట డైరీ కార్పొరేటర్ సొసైటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డైరీ కార్పొరేటు సొసైటీలో ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఆర్థిక సహకారమైన నాబార్డు ద్వారా అందించాలని కలెక్టర్ డిడిఎం నాబార్డ్ ను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గోదాములు , కోల్డ్ స్టోరేజీ, రైస్ మిల్లుల ఏర్పాటుకు ముందుకు వస్తే అవసరమైన సంపూర్ణ సహకారం అందజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీ మాల, డిడిఎం నాబార్డ్, జిల్లా మత్స్యశాఖ అధికారి లీడ్ బ్యాంకు మేనేజర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.