by Suryaa Desk | Fri, Jan 31, 2025, 08:09 PM
పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి అని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. శుక్రవారం పదవి విరమణ పొందిన ఎఆర్ ఎస్ఐ బి. రమేష్ ను కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువా, పూలమాలతో ఎస్పీ సత్కరించి బహుమతి ప్రధానం చేశారు. 40 సంవత్సరముల పాటు పోలీసు వ్యవస్థకు సేవలు అందించారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు అతి సంక్లిష్టమైన రిజర్వు పోలీసు విధులను నిర్వర్తించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశారు.