![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:32 PM
జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ సొసైటీలో వరి, సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
డోంగ్లీ మండలానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జై బాపు - జై భీమ్- జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు.