|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:27 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి BRS ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. GHMCలో మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. GHMC పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు. గతంలో లాగా వార్డుల వారీగా టెండర్లు పిలవాలని కవిత లేఖలో పేర్కొన్నారు.