|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:29 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి BRS పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో మాన్‌సూన్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకునే ఎమర్జెన్సీ చర్యలపై ఆమె ఈ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
GHMCలో మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్‌కు సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలమైన సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయని ఆమె లేఖలో పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితులు గతంలోనూ కనిపించాయని, ఇప్పుడు కూడా అదే దిశగా చర్యలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే గతంలో లాగా వార్డుల వారీగా టెండర్లు పిలవాలన్నదే తన అభిప్రాయమని లేఖలో పేర్కొన్నారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకతతో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఆమె విజ్ఞప్తి చేశారు.