|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 08:04 PM
‘జై తెలంగాణ’ నినాదం ఒక పార్టీకి సంబంధించినది కాదని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల నినాదమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి KCRకు జారీ చేసిన నోటీసులు ఒక స్వతంత్ర దర్యాప్తు కమిషన్ నుంచి వచ్చినవని తెలిపారు. “స్వతంత్ర దర్యాప్తు కమిషన్‌ను రాజకీయంగా విమర్శించడం సరికాదు” అని ఆయన పేర్కొన్నారు.
అలాగే, BRS నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి, “BRS, BJP కలిసి నడుస్తున్నాయని కవిత చెప్పారు. ఈ వ్యాఖ్యలపై BRS, BJP నాయకులు సమాధానం చెప్పాలి” అని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.