|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 02:30 PM
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ విభాగాల్లో 03 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హతగా సంబంధిత విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. నవంబర్ 18 నుంచి 20 వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు careers.bhel.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చు. ఎంపికైన వారికి గంటకు 780 రూపాయల చొప్పున జీతం ఇవ్వనున్నారు.