|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 04:12 PM
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్‌ను బుజ్జగించకపోవడం, సొంత బంధువులకు టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం కలిగించారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలా జరిగితే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. త్వరలో పీసీసీ చీఫ్, మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ నిర్వహించి, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.