|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 10:29 AM
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కలిపి 73 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లలో 66.05% ఓట్లు పోలయ్యాయి.మున్సిపాలిటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా, నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68 శాతం ఓటింగ్ నమోదైంది. మున్సిపల్ కార్పొరేషన్లలో నల్గొండ కార్పొరేషన్‌లో అత్యధికంగా 77.36 శాతం పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైంది.ఓట్లు వేసిన జాబితాలో మహిళలు స్వల్పంగా ముందంజలో నిలిచారు. పురుష ఓటర్లలో 72.63 శాతం కాగా, మహిళా ఓటర్లలో 73.39 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 13న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు.