|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 01:00 PM
ఈ రోజు ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యాను. ఫిబ్రవరి చివరి వారంలో ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో తలపెట్టిన “గాంధీ సరోవర్ ప్రాజెక్టు” శంకుస్థాపన కార్యక్రమానికి వారిని ఆహ్వానించాను. ఈ ప్రాంతానికి ఉన్న ఛారిత్రక నేపథ్యాన్ని గౌరవ కేంద్ర మంత్రికి వివరించాను. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా, మూసీ సంగమ స్థలిలో కలిపిన విషయాన్ని గుర్తు చేశాను. ప్రజా ప్రభుత్వం తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా “గాంధీ సరోవర్” ప్రాజెక్టు చేపడుతున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ గారికి తెలియజేశాను. ఈ ప్రాంతంలో ఉన్న బాపుఘాట్ ను భవిష్యత్ లో ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు శ్రీ రాజ్ నాథ్ సింగ్ కు వివరించాను. ఈ భేటీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.