|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:43 PM
ప్రకృతి వైపరీత్యాల సమయంలో యువ ఆపద మిత్రుల సేవలను వినియోగించుకుంటామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు చెప్పారు. హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో నియామక సమయంలో కూడా వీరికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. ``యువ ఆపద మిత్ర`` పథకంలో భాగంగా హైడ్రాలో శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లకు మంగళవారం ధ్రువపత్రాలు అందజేసిన అనంతరం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మాట్లాడారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 105 మంది యువ వాలంటీర్లు వారం రోజుల పాటు ఫతుల్‌గూడలోని హైడ్రా శిక్షణ పొందారు. ఫిబ్రవరి 18 నుంచి 24 వ తేదీ వరకూ హైడ్రా ఇచ్చే శిక్షణలో ఆపద సమయంలో ప్రజలను ఎలా రక్షించాలనే మెలుకువలన్నీ నేర్చుకున్నారు. స్థానికంగా ఉంటారు.. ప్రమాద సమయంలో రెస్పాండ్ అయ్యే మొట్టమొదటి వ్యక్తులుగా ఓ వైపు సేవలందిస్తూనే.. మరోవైపు వివిధ శాఖల నుంచి వచ్చిన సహాయక బృందాలతో కలసి పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారు మరో 10 మందిని సిద్ధం చేసి.. మేమున్నామనే భరోసా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇవ్వాలని సూచించారు. అలాగే భారీ వర్షాలు, వరదల సమయంలో హైడ్రాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా.. అందుబాటులో ఉండాలని సూచించారు.