|
|
by Suryaa Desk | Thu, Nov 23, 2023, 02:33 PM
ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ 'ధూత' ని డిసెంబర్ 1, 2023 నుండి ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ ఈ 8-ఎపిసోడ్ పాన్-ఇండియన్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో అద్భుతమైన సూపర్ నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ సిరీస్ దూత ట్రైలర్‌ను ఆవిష్కరించింది.
ఈ ట్రైలర్ లో నాగ చైతన్య అక్కినేని జర్నలిస్ట్ సాగర్ గా కనిపించనున్నారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లను రూపొందించడంలో నిపుణుడు మరియు ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు మనల్ని కట్టిపడేసేలా తన మార్క్ చూపించాడు. నాగ చైతన్య పరిశోధనాత్మక జర్నలిస్ట్ పాత్రలో అందరికి ఆకట్టుకుంటున్నాడు. అత్యున్నత స్థాయి విజువల్స్ మరియు అద్భుతమైన స్కోర్‌తో సిరీస్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్‌నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తుంది.