|
|
by Suryaa Desk | Thu, Feb 15, 2024, 03:08 PM
యాట సత్యనారాయణ దర్శకత్వంలో రానున్న తెలుగు చిత్రం "రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్" సినిమా ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ, ఇతర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
1947 ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ జరిగిన సంఘటనలను వెలుగులోకి తీసుకురావడమే ఈ చిత్రం లక్ష్యం. రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, వారి త్యాగాలు మరియు పోరాట సమయంలో వారు ప్రదర్శించిన స్థైర్యాన్ని ఈ చిత్రం వెల్లడిస్తుంది.
ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జున్, బాబీ సింహా, వేదిక మరియు అన్నుశ్రియ త్రిపాఠి కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు.
Latest News