|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 10:51 AM
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపు, డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉండాలి అనే అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈరోజు సాయంత్రంలోగా కేబినెట్ మంత్రులు, వారి శాఖలను ప్రకటిస్తారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేరు ఖరారైనట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేశాక టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో.. ఆయన స్థానంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కాగా, కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకోవాలని భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పెద్దలు కోరినట్టు సమాచారం. అయితే భట్టి, ఈ విషయంలో ఇంకా ఏమీ తేల్చి చెప్పలేదని తెలుస్తోంది.