by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:23 PM
తమ డివిజన్ లో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను వెంటనే చేపట్టాలని నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావుకి స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ పట్టణంలోని 16వ డివిజన్ లో పద్మ నగర్ జంక్షన్లో కూడలి నిర్మించాలని గతంలో తీర్మానం చేసినారు. వాటికి సంబంధించిన బడ్జెట్ కూడా మంజూరై ఉన్నది కానీ ఇంతవరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. అట్టి జంక్షన్ వెంటనే నిర్మించాలని కోరారు.