|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 11:43 AM
TG: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామి మూలవరులకు అర్చకులు అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.