|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 08:20 PM
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 'తెలంగాణ యువ కెరటాలు' యువ కవుల సమ్మేళనం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని MLC కవిత ట్వీట్ చేశారు. 'యువ కవులు, కవయిత్రులు లోతైన అవగాహనతో వినిపించిన కవితలు ఆలోచింప చేసాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, బంజారా భాషల్లో కవిత్వం వ్రాసి వినిపించిన కవులను సన్మానించుకోవడం జరిగింది. తెలంగాణ సాహిత్యం, సంస్కృతులను సమున్నతంగా నిలిపే దిశగా తెలంగాణ జాగృతి కృషి సదా కొనసాగుతూ ఉంటుంది' అని పేర్కొన్నారు.