|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:32 PM
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG), హైదరాబాద్ ఆదేశాల మేరకు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆఫీస్ సహకారంతో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద 3 కి.మీ., 5 కి.మీ., మరియు 21 కి.మీ. పరుగు పోటీలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రన్నర్స్-2025 కార్యక్రమంలో ఆసక్తి ఉన్న క్రీడాకారులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారి కోరారు.