|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 07:29 PM
షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భజన బృందం ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు శ్రీరామ నామస్మరణతో, ఆట పాటలతో, భజనలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రాచార్య, అర్చకులు కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతులు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.