|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:35 PM
TG: ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు హుస్నాబాద్ సభలో సీఎం రేవంత్ ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని.. 2004లో కరీంనగర్ గడ్డ నుంచే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి 2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు.