|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 12:28 PM
అల్లరి చేస్తున్నాడని బాలుడి కన్ను పోయేలా కొట్టిన అంగన్వాడీ టీచర్ . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తమ కుమారుడు విద్వాన్ష్‌ను అంగన్వాడీ కేంద్రంలో వదిలేసి తమ పనులు చేసుకునేందుకు వెళ్లిన కొంపెల్లి లక్ష్మీ, విజయ్ కుమార్ దంపతులు. తమ కుమారుడికి జ్వరం వచ్చిందని, ఇంటికి తీసుకెళ్లాలని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన అంగన్వాడీ టీచర్ రాణి. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చూసేసరికి, బాలుడి కంటికి, చేతులకు తీవ్ర గాయాలు ఉండడం గమనించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు . బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు అంగన్వాడీ టీచర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు