|
|
by Suryaa Desk | Thu, Nov 23, 2023, 11:29 AM
మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి సర్ ప్రైజ్ అప్ డేట్ ను రిలీజ్ చేశారు టీమ్. మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈమూవీని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో.. మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుంన్నారు. హిందీలో మహాభారతం సిరీస్ లను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈమూవీలో ఇండియాలోని ప్రముఖ నటీనటులతో నింపేశారు. ఇప్పటికే ఈ సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ నటుడు సందడి చేయబోతున్నట్టు ప్రకటించారు టీమ్.ఇక కన్నప్ప సినిమా నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ తో సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు టీమ్. ఇక తాజాగా మంచు విష్ణు పుట్టిన రోజు కావడంతో ఆరోజు ( నవంబర్ 23) కన్నప్ప సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అడవుల్లో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు గాల్లోకి ఎగురుతూ బాణాలు వేస్తున్నాడు. వెనుక కొండలు, జలపాతాలతో శివలింగం ఆకారం అద్భతంగా డిజైన్ చేశారు. దీంతో పోస్టర్ ను చూసిన ఆడియన్స్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు కన్నప్ప టైటిల్ కూడా ఆసక్తిగా డిజైన్ చేశారు. డైరెక్టర్ తన క్వాలిటీ వర్క్ ను చూపించడం ఇక్కడ నుంచి మొదలు పెట్టారు.
Latest News