|
|
by Suryaa Desk | Thu, Nov 23, 2023, 02:06 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క యాక్షన్ ప్యాక్డ్ టీజర్ అభిమానులలో మరియు ట్రేడ్ వర్గాల్లో అంచనాలను పెంచింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గత రాత్రి కంగువ సెట్‌లో ఒక చిన్న ఆక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. బిల్డ్-అప్ షాట్‌ను క్యాప్చర్ చేస్తున్నప్పుడు అనుకోకుండా సూర్య భుజానికి తాడు తగిలింది. అదృష్టవశాత్తూ సూర్యకి ప్రమాదం ఏమి లేదు అయితే షూటింగ్ మాత్రం వాయిదా పడింది. అభిమానులు సూర్య గురించి ఆందోళన చెందుతున్నారు మరియు సెట్స్‌పై శ్రద్ధ వహించాలని చిత్ర బృందాన్ని అభ్యర్థించారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం 2024 వేసవిలో 2D మరియు 3D ఫార్మాట్లలో 10 భాషలలో విడుదల కానుంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.