|
|
by Suryaa Desk | Thu, Nov 23, 2023, 02:12 PM
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ అధికారకంగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ధృవ నచ్చతిరమ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో జాన్‌గా విక్రమ్ నటిస్తున్నాడు. తమిళం మరియు తెలుగు భాషలలో రేపు థియేటర్లలోకి రానుంది. ఈ స్పై యాక్షన్ డ్రామాకి తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్‌లు ఇంకా తెరవబడలేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌పై మూవీ మేకర్స్ మౌనంగా ఉండడంతో సినిమా విడుదలపై నిరాశ నెలకొంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ చిత్రం మరొకసారి వాయిదా పడవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా రీతూ వర్మ నటిస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, పార్తీబన్, సిమ్రాన్, రాధిక, దివ్య దర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్లస్ లో విక్రమ్ టీమ్ హెడ్ పాత్రలో కనిపించనున్నాడు. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోం ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధృవ నచ్చతిరమ్‌కి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.