|
|
by Suryaa Desk | Thu, Nov 23, 2023, 02:19 PM
కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక పాట చిత్రీకరణకు సిద్ధం అవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, చిత్ర బృందం ఎన్టీఆర్ తో త్వరలో ఒక మాస్ సాంగ్ చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాటు నాటు ఫేమ్ ప్రేమ్ రక్షిత్ 2000 మంది డ్యాన్సర్లతో కలిసి ఎన్టీఆర్ కోసం ఈ పాటకు కొరియోగ్రఫీ చేయనున్నారు.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.