by Suryaa Desk | Sat, Jul 13, 2024, 01:03 PM
పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను కాంగ్రస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు.