by Suryaa Desk | Thu, Sep 26, 2024, 02:42 PM
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొని ఆమె విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వాములపై గర్జించిన `సివంగి`చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.