by Suryaa Desk | Thu, Sep 26, 2024, 02:56 PM
నర్వ మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.
భూమి కోసం, భుక్తి కొరకు, వెట్టిచాకిరి విముక్తి కొరకు సాగిన పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఐలమ్మ ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రజకులు పాల్గొన్నారు.