|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 04:32 PM
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యే విషయంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావుతో పలు దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే ఆయన విచారణకు హాజరవుతారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో.. ఇప్పుడు విచారణకు మరింత గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూన్ 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీన విచారణకు రాలేనని.. బదులుగా మరో తేదీని కేటాయించాలని ఆయన ఇప్పుడు కమిషన్‌కు బదులు ఇవ్వబోతున్నారట!. ఇతర కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని, కావాలంటే ఈ నెల 11వ తేదీన హాజరవుతానని ఆయన లేఖలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది.