|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 04:01 PM
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10 నుంచి గాంధీభవన్‌లో ప్రజల విజ్ఞప్తులను పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు ఉండేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇదివరకే మంత్రులతో ముఖాముఖీ ఉండగా.. తాజాగా TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి రోజు ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఉండేలా కార్యక్రమం రూపొందించారు. జూన్ 10 నుంచి ప్రతి రోజు ఉ.10 గంటల నుంచి మ.1 గంట వరకు అందుబాటులో ఉంటారు.