|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 10:56 AM
సంక్రాంతి, మేడారం జాతర ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో రూ.300కి పైగా చేరిన కిలో చికెన్ ధర ఇప్పుడు రూ.240కి పడిపోయింది. కోళ్ల ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో నాన్ వెజ్ ప్రియులకు, సామాన్యులకు ఖర్చు తగ్గడంతో ఊరట లభించింది. కేవలం మాంసం మాత్రమే కాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 9కి చేరిన కోడిగుడ్డు ధర కూడా ఇప్పుడు రూ. 6కు పడిపోయింది. పౌల్ట్రీ యజమానుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో ఉత్పత్తి మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉండటంతో, ధరలు ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. చేపలు, మటన్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, సామాన్యుడికి అందుబాటులో ఉండే ఏకైక నాన్-వెజ్ వనరు చికెన్ మళ్లీ అందుబాటులోకి రావడం విశేషం.