|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 03:13 PM
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు చేసింది. మూడో విడత బిల్లులను వీబీ జీరామ్‌జీ పథకానికి అనుసంధానం చేశారు. జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించి, ఆ వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చెల్లిస్తుండగా, పునాదికి రూ.లక్ష, గోడలకు రూ.లక్ష, స్లాబ్‌కు రూ.1.40 లక్షలు, పని పూర్తయ్యాక రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. మూడో దశలో స్లాబ్ తర్వాత ఉపాధిహామీ కింద రూ.27,630, స్వచ్ఛభారత్ కింద రూ.12 వేలు, పీఎంజీఏవై కింద రూ.21 వేల చొప్పున మొత్తం రూ.60 వేలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.అయితే గత రెండేళ్లుగా ఉపాధిహామీలో కొత్తగా జాబ్‌కార్డుల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిలో చాలా మంది జాబ్‌కార్డులు లేనివారు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీరు ఈ పథకాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా ఉపాధి జాబ్ కార్డులు జారీ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.