|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 03:15 PM
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, మీర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నంది హిల్స్ కాలనీలోని 2100 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా పరిరక్షించింది. కాలనీలో ప్రజావసరాల కోసం కేటాయించిన ఈ పార్కు స్థలంలో కొంత భాగాన్ని కొందరు రాజకీయ నాయకుల బై నంబర్ వేసి ఆక్రమించారు. నకిలీ లేఅవుట్లు సృష్టించారని కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి.. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించారు. వెంటనే చర్యలు తీసుకుని 2100 గజాల పార్కు స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు కాపాడారు. హైడ్రా చర్యలను స్థానికులు అభినందించారు. ప్రజావసరాలకు కేటాయించిన భూములను, పార్కులు, ఓపెన్ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని కాలనీ వాసులు పేర్కొన్నారు.