|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 11:57 AM
బిట్స్ - పిలానీ హైదరాబాద్‌కు రూ. 36 కోట్లు విరాళం అందించిన పూర్వ విద్యార్థులు, దంపతులు చంద్ పి.గర్గ్, మంజు గర్గ్. 1968లో బిట్స్ - పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన చంద్ పి.గర్గ్, మంజు గర్గ్. అనంతరం అమెరికాలో స్థిరపడి.. ఇంటర్నేషనల్ ట్రేడ్స్, క్రెడిట్స్ వ్యాపారం చేస్తున్న దంపతులు. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించాలని.. దీనికోసం 100 మిలియన్ డాలర్ల నిధిని సమీకరించాలని 18 నెలల క్రితం నిర్ణయించిన బిట్స్ - పిలానీ కార్యవర్గం. దీంతో 4 మిలియన్ డాలర్లు (రూ.36 కోట్లు) బిట్స్ - పిలానీ హైదరాబాద్‌కు విరాళంగా అందించిన దంపతులు. ఈ విరాళాలలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 34 మిలియన్ డాలర్లు విరాళాలు అందించిన పూర్వ విద్యార్థులు