|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 03:21 PM
ఇటీవల ముగిసిన మేడారం మహా జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈసారి మేడారంలో 788 హుండీలను ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు తమ కానుకలను సమర్పించుకున్నారు. ఈ లెక్కింపునకు సుమారు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గత జాతరలో రూ.13 కోట్ల ఆదాయం వచ్చినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.ఈ లెక్కింపును దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగులు, స్వచ్చంద సంస్థ ల కార్యకర్తలు మొత్తం 150 మంది ఈ లెక్కింపులో పాల్గొంటున్నారు… వీరిలో దేవాదాయ శాఖకు చెందినవారు 70మంది, సేవ సమితికి చెందినవారు 80మంది ఉన్నారు… మొత్తం 820 హుండీలు ఉండగా ప్రస్తుతం 780హుండీలు టి టి డి కళ్యాణ మంటపం కు తీసుకురాగా ఇంకా 40 హుండీలు మేడారం నుంచి తీసుకు రావాల్సి ఉందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు